Prof. Ravinutala Satyanarayana
ప్రో. రావినూతల సత్యనారాయణ

Prof. Ravinutala Satyanarayana ప్రో. రావినూతల సత్యనారాయణ Prof. Ravinutala Satyanarayana ప్రో. రావినూతల సత్యనారాయణ Prof. Ravinutala Satyanarayana ప్రో. రావినూతల సత్యనారాయణ

Prof. Ravinutala Satyanarayana
ప్రో. రావినూతల సత్యనారాయణ

Prof. Ravinutala Satyanarayana ప్రో. రావినూతల సత్యనారాయణ Prof. Ravinutala Satyanarayana ప్రో. రావినూతల సత్యనారాయణ Prof. Ravinutala Satyanarayana ప్రో. రావినూతల సత్యనారాయణ
  • Home
  • About
  • Writing
  • Reviews
  • Press Coverage
  • Gallery
  • Contact Us
  • More
    • Home
    • About
    • Writing
    • Reviews
    • Press Coverage
    • Gallery
    • Contact Us

  • Home
  • About
  • Writing
  • Reviews
  • Press Coverage
  • Gallery
  • Contact Us
Puraskara Sahityam

BOOKS

Puraskara Sahityam was published by Misimi Publications in the year 2015.  

The book is a compilation of  analytical essays on renowned authors in Telugu Literature and their works that were honoured with the Sahitya Akademi Award.

Recommended reading for those pursuing under-grad and  post-grad degree in Telugu Lit.

Purchase A Copy

పుస్తకం గురించి / ABOUT PURASKARA SAHITYAM

  

తెలుగు భాషలో ‘కేంద్ర సాహిత్య అకాదెమీ పురస్కారం పొందిన వారి రచనలను, సమీక్షించాలనుకున్నాం. మా అభిరుచికి తగ్గట్టుగా ప్రొఫెసర్‌ రావినూతల సత్యనారాయణ గారు స్పందించారు.


ఇదొక బృహత్‌ కార్యం. ఇందులో రచయితల రచనలే కాకుండా ఒక్కొక్కప్పుడు వారి జీవితంలోకి తొంగిచూడవలసిన అవసరం రావచ్చు. కేవలం రచనలు చదివితే సరిపోదు. రచయిత స్వభావంపట్ల కూడా అవగాహన ఉండకపోతే సమీక్ష తేలిపోతుంది. రచయితలు తాము రాసే రాతకు, జీవించే జీవితానికి పొంతనే ఉండదు. వీటిని సమన్వయపరుస్తూ వారి రచనలను విశ్లేషించగలగాలి. కవిత్వమైనా, కథైనా, నవల అయినా, నాటకమైనా, విధానమేదైనా అన్నీ వ్యక్తిత్వ సూచికలే. రచయిత అనుభూతి పరిసరాల వీచికలే.


ప్రతి రచయితా తన మనసులో ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుంటాడు. ఆనందం, ఆవేశం, ఆవేదన, ఆర్తి ఇవన్నీ తన రచనలలో ప్రతిబింబింపచేస్తాడు. రచయితలకు భావావేశం ఎక్కువ. దానికి భిన్నమైన తర్కం కూడా ఉంటుంది. అవన్నీ పాఠకులలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. రచయితను, పాఠకుడిని ఎదురెదురుగా నిలబెట్టి కరచాలనం చేయించగలిగినవాడే నిజమైన సాహితీ సమీక్షకుడు. ఆయన తన సమీక్షలో ఆయా రచయితలకు సంబంధించిన ఏ పుస్తకాన్నీ వదలలేదు. 


తెలుగు భాషలో వెలుగు చూసి, పురస్కారం పొందిన రచనలన్నింటినీ, రచయితలెందర్నో సమీక్షించి, పరిచయం చేసి, తెలుగు పాఠకులకు గ్రంథ రూపంలో అందిస్తున్నారు. ఇది విజ్ఞులైన పాఠకులకూ, పరిశోధనాశీలురైన విశ్వవిద్యాలయ విద్యార్థులకూ కరదీపికగా ఉండగలదని ఆశిస్తున్నాం.

NEW RELEASES

Saraswata Vyasalu

Saraswata Vyasalu

Saraswata Vyasalu

Introduction by Prof.  Anumandla Bhoomaiah 

(ప్రొ. అనుమాండ్ల భూమయ్య )

  

మిసిమి పాఠకులనలరించిన ప్రొ. రావినూతల సత్యనారాయణగారి సారస్వత వ్యాసా లివి. ప్రొఫెసర్‌గారి సతీమణి శ్రీమతి వరలక్ష్మీగారు ఆ వ్యాసాలను సంకలనం చేసి ముద్రించడం ముదావహం. ఈ వ్యాసాలు పాఠకులకు విజ్ఞానదాయకాలు. పరిశోధకులకు మార్గదర్శకాలు. ఆయా కవుల, రచయితల జీవిత విశేషాలను వారి రచనలను గూర్చిన వివరాలు ఈ వ్యాసాల్లో ఉన్నాయి. పరిశోధక విద్యార్థులు తమ పరిశోధన అంశంగా ఒక కవిని లేదా అతని ఒక రచనను ఎన్నుకొన్నప్పుడు అతడు ఏ పద్ధతిని అనుసరిస్తాడో ఆ పద్ధతి ఈ వ్యాసాలన్నిటిలో ఉంది. మొదట నేపథ్యం, చివర ఉపసంహారం మధ్యలో ప్రధానాంశం ఉంటుంది. ఒక రచనను విశ్లేషింప బూనుకొన్నప్పుడు ఆ కవి జీవిత విశేషాలను సంక్షిప్తంగా పరిశోధకుడు తెలియపరుస్తాడు. ఒక రచయిత పుట్టి పెరిగిన వాతావరణం, చదివిన చదువు, చేసిన ఉద్యోగాదులు ఇవి ఉపరితల అంశాలు. రూపవర్ణనవంటిది. మొదట రూపం. పిదప గుణం. ఒకరకంగా ఇది నాటకంలో పాత్రప్రవేశ సూచనవంటిది. ఈ వ్యాసాల్లోని ప్రారంభం, ముగింపు విశేషమైనవి. వాటిని సారవంతమైనవిగా తీర్చిదిద్దాడు రచయిత. మధ్యభాగంలో వివరాలను విశ్లేషణాత్మకంగా పొందుపరిచాడు.

ఒక గ్రంథాన్ని గూర్చి ఎవరైనా పరిశోధన చేస్తే అది సమగ్రమైనదని, దానిని గురించి మళ్లీ పరిశోధన చేయవలసిన అవసరం లేదని కొందరు భావిస్తుంటారు. కాని, ఎవరి దృష్టి వారిదే. నూతన దృష్టి కలిగినవారికి ఆ గ్రంథమే క్రొత్తగా దర్శనమిస్తుంది. పూర్వ విమర్శ గ్రంథంకంటే ఇది గొప్పగా రావచ్చు. పరిశోధకుడికి కావలసింది నూతన దృష్టి, నిష్పాక్షికత అనే విషయం ఆయా గ్రంథాలను గురించి ప్రొఫెసర్‌ రావినూతలవారు చేసిన విశ్లేషణలను గమనిస్తే తెలుస్తుంది. ఒకరికి కనిపించని గ్రంథంలోని కొత్త అంశం మరొకరికి కనిపించకూడదని ఏమీ లేదు. విమర్శకుని చదువూ, సంస్కారాన్నిబట్టి చూసే చూపు ఏర్పడుతుంది. ఒక విమర్శకునికి ఒక కాలంలో స్ఫురించని గ్రంథంలోని అంశాలు, కాలాంతరాన చదివితే స్ఫురిస్తాయి. విరబూసిన ఒక వృక్షాన్ని చూసినప్పుడు కళాకారుని దృష్టి, వ్యాపారవేత్త దృష్టి ఒకేరకంగా ఉండదంటారు. చూసేవారినిబట్టి గ్రంథం కనిపిస్తుంది. నూతన దృష్టి, నిష్పాక్షికత పరిశోధకునకు ఉన్నట్లయితే ఉత్తమ విమర్శ సాహిత్యం వెలువడుతుందన్న అభిప్రాయం ఈ వ్యాసాల ద్వారా స్పష్టమవుతుంది.

ఈ వ్యాస సంపుటిలోని ఒక్కొక్క వ్యాసం విజ్ఞాన కిరణాలను వెదజల్లే ఒక అనర్ఘరత్నం. ఆ విధంగా ఈ గ్రంథమొక రత్నమాలిక. అటు పాఠకులకు, ఇటు పరిశోధకులకు ఎంతగానో ఉపకరించే వ్యాసాలను రచించిన గౌరవనీయులు ప్రొఫెసర్‌ రావినూతల సత్యనారాయణగారికి స్మృత్యంజలి ఘటిస్తున్నాను. 


vYASA MANJUSHA

Saraswata Vyasalu

Saraswata Vyasalu

Introduction by  Dr. Oleti Parvateesam

( డా. ఓలేటి పార్వతీశం)


  కాస్తో ` కూస్తో, పరిశీలనో, పరిశోధనో చేస్తే సాహిత్యానికి ఆరంభ దశనో అంచనా వేయవచ్చు. కానీ కాలానికి అటువంటి ఆరంభ దశను అంచనా వేయలేము. కాలమూ ప్రవహిస్తుంది, సాహిత్యమూ ప్రవహిస్తుంది. ఈ రెండిరటా ప్రవాహ గుణమనే సారూప్యమున్నది. కనుక మన అవగాహన కోసం విభజన రేఖలు గీస్తాం. రాత్రి, పగలూ, నిన్న, నేడు, రేపు ` ఇలా రకరకాల విభజనలు. సాహిత్యంలోనూ కొన్ని విభజన రేఖలు ఏర్పడ్డాయి. ప్రాచీనమా? అర్వాచీనమా? అలాగే ప్రక్రియాపరమైన విభజనలు కథా, కవిత, వ్యాసం వగైరా. ఎప్పుడైతే విభజనలు ఏర్పడ్డాయో తులనాత్మకత, సారూప్యత, ఆధిక్యత ఇటువంటివన్నీ పరిశీలనకు, పరిశోధనకు వస్తాయి. ముఖ్యంగా ఏది నాణ్యమైనదో తేల్చాలంటే మేథోజీవుల ఆవశ్యకత ఏర్పడుతుంది. బంగారం నాణ్యతను ఆకురాయిపైన గీటుగీసి తేల్చేసినట్లు, మేథోజీవులు, సాహిత్యాన్ని కాలమానినిపైన గీటుగీసి దాని ఔన్నత్యాన్ని అంచనా వేస్తారు. అటువంటి మేథోజీవులలో అగ్రభాగాన మనకు పరిచయమయ్యే ఒకానొక పేరు ఆచార్య రావినూతల సత్యనారాయణ. మా ఇద్దరి మధ్య ఒక పరోక్ష పరిచయం చాలా కాలం క్రితమే ఉన్నది.

వృత్తం పరిధుల మధ్య విస్తరించి ఉన్న కైవారం విస్తృతిని అంచనా వేయాలంటే ఆ వృత్త కేంద్రం నుండి ప్రయాణించే వ్యాసం ఒక మార్గం. అలాగే ఒక వ్యక్తి లేదా ఒక గ్రంథం లేదూ ఒక అంశమూ ఇతివృత్తంగా ఆవిష్కృతమైన రచనలోని వైశిష్ట్యాన్ని అంచనా వేయాలంటే రావినూతల సత్యనారాయణ గారి వ్యాసం ఒక మార్గం. ప్రణాళికాబద్ధమైన వ్యాసరచన సత్యనారాయణ గారిది. శిరోభాగాన భూమిక, దేహ భాగంలో విస్తరణ, అంత్య భాగంలో ముగింపు వ్యాస రచనలో సత్యనారాయణ గారిది విస్పష్టమైన ముద్ర. ఇలా తన ముద్రను ప్రకటిస్తూ, ఆయన అప్పుడప్పుడు వ్రాసిన వ్యాసాల సమాకలనమే ఈ వ్యాస మంజూష. తెలుగు సారస్వత లోకానికి, ఆయన తదనంతరం ఒక జ్ఞాపికగా అందివస్తున్న ఈ వ్యాస సంపుటి అపురూప బహుకృతి. కొందరు ప్రసిద్ధులైన వ్యక్తుల గురించి, కొన్ని ప్రాచుర్యం పొందిన గ్రంథాల గురించి, ఇంకొన్ని పసిడి కాంతులు వెదజల్లిన సామ్రాజ్యాల గురించి, ముప్పేటగా ముడివేసిన త్రివేణి ఇది. ప్రతిభామతిjైున సత్యనారాయణ ఆకృతి ముందు అరచేత పట్టిన చిన్నపాటి అద్దం, ఈ వ్యాస సంపుటి.

BOOKS ON LIBRARY AND INFORMATION SCIENCE

 INFORMATION TECHNOLOGY AND ITS FACETS 

PROBLEMS OF INFORMATION SCIENCE

AUTHOR

EDITOR, CO-AUTHOR

EDITOR, CO-AUTHOR

A compendium based on the research work by Professor R. Satyanarayana for his doctoral thesis for which he was awarded Ph.D. Degree by Gulbarga University, Karnataka.

The book contains an authentic account on the Nature of Information, Information Science and, various dimensions of Modern Information Technology. 


PURCHASE A COPY

EDITOR, CO-AUTHOR

EDITOR, CO-AUTHOR

EDITOR, CO-AUTHOR

Published in 1996 by New Age International this book edited and co-authored with colleague and fellow expert N.R. Satyanarayana Problems of Information Science deals with the challenges in cataloging and automation of libraries. A veritable handbook for librarians and students of Library and Information Science alike.


PURCHASE A COPY

ARTICLES

This website features selections from the vast library of writing of Prof. Satyanarayana. 

Prof. Ravinutala Satyanarayana

Copyright © 2021 Varalakshmi Ravinutala and 

Sudham Ravinutala (www.sudhaam.com) - All Rights Reserved.

Powered by GoDaddy

This website uses cookies.

We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.

DeclineAccept

TWO NEW VOLUMES

A  2 volume compilation of articles penned by 

Prof. Ravinutala Satyanarayana has now been released.